మా ఇంట్లో ఓట్లు అమ్ముకోం...తాయిలాలకు తాకట్టు పెట్టం

సూర్యాపేట జిల్లా: ఓటుకు రేటు కట్టి కొనుకునే నాయకులు, మేము ఓటేస్తే నాకెంత ఇస్తారనే ఓటర్లు ఉన్న కాలంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 21వ వార్డు శ్రీమన్నారాయణ కాలనీ జమ్మిచెట్టు బజార్ లో కొల్లు లక్ష్మినారాయణ ఇంటి ముందు మా కుటుంబంలో ఓట్లను అమ్ముకోమంటూ ఇంటి ముందు కట్టిన బ్యానర్ అందరినీ ఆకర్షిస్తుంది.

కుటుంబ యజమాని కొల్లు లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థి కావడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని,రాజ్యాంగం ఇచ్చిన ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదనే విషయం ప్రజలకు తెలిసేందుకు ఈ బ్యానర్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా సరైన వారిని ఎంచుకొని ఓటు వేయాలని,డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దని అన్నారు.

వాహనదారులకు,కాలనీ వాసులకు ఈ బ్యానర్ చూసి మార్పు రావాలని కోరారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్
Advertisement

Latest Suryapet News