డంపింగ్ యార్డ్ తో నరకయాతన అనుభవిస్తున్నాం

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామ శివారులోని కోదాడ డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేయగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,కలెక్టర్,డంపింగ్ యార్డ్ ను సందర్శించి డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి వేరే చోటికి తరలిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చి మరిచారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

దశాబ్ద కాలంగా దీని నుండి వెలువడే దుర్వాసన భరించలేక పోతున్నామని,దానిని నిప్పు పెట్టడంతో వెలువడే పొగ ఊరిని కమ్మేసి అనారోగ్యం బారిన పడుతున్నామని,గ్రౌండ్ వాటర్ కూడా కలుషితమై మంచినీరు తాగలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు.

గత ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే,జిల్లా అధికారులు వైఫల్యం చెందారని,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి చొరవ తీసుకొని కోదాడ డంపింగ్ యార్డును వేరే చోటుకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.పేరుకే సేంద్రియ ఎరువులు తయారీ అంటూ తడి పొడి చెత్తలను కాల్చేస్తుండ్రని,నిత్యం పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తను అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న గుట్టపై డంప్ చేస్తారు.

పేరుకు సేంద్రియ ఎరువుల కేంద్రం కానీ,తడి పొడి చెత్తను వేరు చేసే సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు.నిత్యం మంటల్లో చెత్తను కాల్చడంతో పొగ పక్కనే ఉన్న వెంకట్రామపురం,గోల్ తాండ,వాయిలసింగరం, రామిరెడ్డిపాలెం గ్రామాల ప్రజలు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దీంతో శ్వాసకోశ,చర్మ సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిపై ఆశలు పెట్టుకున్నమని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన పొనుగోటి హేమంత్ అంటున్నారు.

Advertisement

ఎన్నో ఏళ్ల నుండి కోదాడ డంపింగ్ యార్డ్ వెంకట్రాంపురం గ్రామ శివారులో ఉండడంతో ఎంతోమంది అనారోగ్య భారీన పడి చనిపోయారు.ఇదంతా గత ఎమ్మెల్యేకు తెలిసినప్పటికీ ఇక్కడ నుండి వేరే చోటికి తరలించలేకపోయారు.

ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వెంకటాపురం గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చాం.అలాగే మా గ్రామ సమస్యలు కూడా ఎమ్మెల్యే తీరుస్తారని ఆశతో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest Suryapet News