అంగన్వాడి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలంలో అంగన్వాడీ టీచర్ల పోస్ట్ (1) ఆయాలు (5) ఖాళీగా ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేదిక అందించారు.

ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లే ఇన్చార్జిలుగా చూస్తున్నారు.

దీంతో టీచర్లకు అదనపు భారంగా మారి ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ప్రభుత్వం ఆశించిన లక్ష్యం మేరకు లబ్ధి చేకూర్చడం లేదు.అలాగే అంగన్వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న 65 సంవత్సరాల వయసు పైబడిన టీచర్ల,ఆయాల పదవి విరమణ ప్రక్రియ గత ఏడాదిగా కొనసాగుతుంది.

Waiting For The Notification Of Anganwadi Jobs, Notification ,Anganwadi Jobs, A

మండలంలో ఇప్పటివరకు ఆయా ఒకరు ఉద్యోగ విరమణ పొందారు.దీనితో ఏటా అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీ ఏర్పడుతున్నాయి.

కాగా చదువుకున్న స్త్రీలు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement
ఒక్క మార్కు..ఒకే ఒక్కమార్కు..1.85 లక్షల మందిని ఫెయిల్‌ చేసింది...!

Latest Suryapet News