తమ ముఖ చర్మం తెల్లగా అద్దంలా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది ఆశ పడుతుంటారు.అటువంటి స్కిన్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను( White And Glass Skin ) మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా చిన్న బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం( Rice ) మరియు కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన పదార్థాలను కొంచెం చల్లారబెట్టుకుని ఆపై మిక్సీ జార్ లో స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చాలా ప్రయోజనాలు పొందుతారు.
ముఖ్యంగా ఈ రెమెడీ చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి మరియు నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.

చర్మాన్ని తేమగా ఉంచుతుంది.ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య లక్షణాలకు చెక్ పెడుతుంది.చర్మం యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
హైపర్ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ రెమెడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.