సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీనివల్ల జుట్టు పల్చగా పొట్టిగా ఉంటుంది.
ఈ క్రమంలోనే హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.తరచూ ఏదో ఒక హెయిర్ ప్యాక్ వేస్తూనే ఉంటారు.
అయినా సరే జుట్టు పెరగడం లేదా? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక నాలుగు నుంచి ఐదు రెబ్బలు వేపాకు( Neem Leaves ) వేసి ఉడికించాలి.నీరు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వేపనీరు చల్లారే లోపు ఒక చిన్న ఉల్లిపాయను( Onion ) తీసుకుని తొక్క తొలగించి సన్నగా తరుముకుని జ్యూస్ సెపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయ జ్యూస్ లో ఒక కప్పు వేప నీరు వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ టానిక్ ను కనుక వాడితే వద్దన్నా మీ చుట్టూ విపరీతంగా పెరుగుతుంది.
వేపాకు మరియు ఉల్లిలో ఉండే పోషకాలు తలచర్మంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచి, కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.

వేపాకులో ఉండే యాంటీ-ఫంగల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును సంపూర్ణంగా నివారిస్తాయి.ఉల్లిపాయలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ జుట్టును వాతావరణ కాలుష్య ప్రభావాల నుంచి రక్షిస్తుంది.తలచర్మాన్ని శుభ్రపరిచి, స్కాల్ప్ ను హైడ్రేట్‌గా మారుస్తుంది.ఉల్లి, వేపాకుతో పైన చెప్పిన విధంగా హెయిర్ టానిక్ ను తయారు చేసుకుని ప్రతివారం వాడితే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.







