భారతీయ సాంప్రదాయంలో చీరలకు( Saree ) చాలా ప్రత్యేకత ఉంది.సాంప్రదాయ దుస్తులుగా చీరలను పరగణిస్తారు.
వయస్సుపైబడిన మహిళలు చీరలను రోజూ ధరిస్తూ ఉంటారు.ఇక అమ్మాయిలైతే ఫంక్షన్లు, పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో చీరలను ధరిస్తూ ఉంటారు.
ఏదోక ప్రత్యేక సందర్భం ఉంటే తప్ప అమ్మాయిలు చీర ధరించరు.చీరలో అమ్మాయిలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు.
కానీ చీరను క్యారీ చేయడమనేది చాలామంది అమ్మాయిలకు అసౌకర్యంగా ఉంటుంది.అందుకే ఎక్కువగా చీరలు ధరించడానికి ఆసక్తి చూపరు.
ఇక మహిళలు వ్యాయామాలు, రన్నింగ్( Workouts ) లాంటివి చేసినప్పుడు చీరలను ధరించరు.చీరలు కాళ్లకు అడ్డుపడుతూ ఉంటాయి.దీని వల్ల వ్యాయామం, రన్నింగ్, వాకింగ్ చేయడం కుదరదు.దీంతో ఆ సమయాల్లో ధరించరు.అయితే ఒక మహిళ మాత్రం చీర కట్టుకుని వర్కౌట్లు చేస్తోంది.చీర కట్టుకుని జిమ్ ( Gym ) చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంతో అవి కాస్త వైరల్ గా మారాయి.రీనా సింగ్ ( Reena Singh ) అనే ఫిట్ నెస్ ట్రైనర్ కు చీరలు కట్టుకోవడమంటే చాలా ఇష్టం.
అలాగే వ్యాయామం చేయడమన్నా చాలా ఇష్టం.దీంతో తనకు ఇష్టమైన ఆ రెండు పనులను చేస్తూ ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చీర కట్టులో రీనా సింగ్ వర్కౌట్లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇవి చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.అన్ని రకాల వ్యాయామాలను ఆమె చీరలోనే చేస్తుంది.దీంతో చీరలో ఎలా వ్యాయామాలు చేస్తుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.చీర క్యారీ చేయడం చేతకాదని చాలామంది చెబుతూ ఉంటారు.అలాంటివారు రీనా సింగ్ ను చూసి నేర్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు.
రీనా సింగ్ తరచూ చీరలో వ్యాయామం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తోంది.