బాల్యంలోనే బహుముఖ ప్రజ్ఞ ఉండాలి: ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా: కోదాడ ప్రాంత నుండి కరాటేలో ఉత్తమ శిక్షణ కనపరచిన విద్యార్థులకు, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గురువారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కరాటే సర్టిఫికెట్లు,అవార్డ్లు ప్రధానం చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు, మనోధైర్యం కల్పించే మార్షల్ ఆర్ట్స్ క్రీడలు నేర్చుకోవాలన్నారు.

ఒకప్పుడు హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఇటువంటి కరాటే శిక్షణ నేడు కోదాడలో అందుబాటులోకి తెచ్చిన కరాటే మాస్టర్ క్రాంతి కుమార్ అభినందనీయుడన్నారు.కరాటే ఆత్మ రక్షణకు,ఆత్మ విశ్వాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు.

Versatility Should Be Practiced In Childhood MLA Padmavathi, MLA Padmavathi, Su

తల్లిదండ్రులు పిల్లలకు కరాటే విధిగా నేర్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు మునిసిపల్ కౌన్సిలర్ కర్రి శివసుబ్బారావుతో పాటు విద్యార్థులు జి.మోక్షిత్, అయినాల ఈషా,మన్వీత్, ఋవంతిక,ఓం సాయి, జస్వంత్,సాయి, అయినాల మాధవ సాయి, వైష్ణవి,అక్షయ,అక్షిత, ఉజ్జిత,ఉద్వేజ్,హర్షవర్ధన్, మిధున్ చక్రవర్తి,ధృవ, జయంత్ సాయి,వేముల కరుణ్ కుమార్,చక్రవర్తి, బానోతు చక్రవర్తి,సంజు, వాగ్దేవి మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!
Advertisement

Latest Suryapet News