మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని తెలిపారు.
ఏపీ కాంగ్రెస్ లో ఎవరూ నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు.
రాష్ట్రంలో జగన్ ను గద్దె దించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.అలాగే జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు.
అదేవిధంగా ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహ గర్జన కార్యక్రమం జరుగుతుందని ఆయన వెల్లడించారు.







