వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలు తీసుకెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లోని పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాలలో స్వాధీనం చేసుకున్న వాహనాల యెక్క యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకవేళ్ళవచ్చునని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) అన్నారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను, వివిధ సందర్భలలో సీజ్ చేయబడిన వాహనాలను వాహన యజమానులు 6 నెలలలోపు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకవేళ్ళచ్చు అని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు,గుర్తు తెలియని వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తరలించినట్లు తెలిపారు.మొత్తం జిల్లా వ్యాప్తంగా 55(ఆటోలు 09, కార్స్ 02,సుమో 01, బైక్స్ 43) వాహనాలను ఉన్నాయని తెలిపారు.

ఆరు నెలల వ్యవధిలో సరైన ధృవ పత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని,ఒకవేళ వాహన యజమానులు లేనియెడల వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు చూపెట్టి తీసుకవేళ్ళచు అని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 6 నెలల తరువాత వాహనాలను వేలం వేయడం జరుగుతుంది అని అన్నారు.వాహన యజమానులు సంబంధిత పత్రాలతో ఈ రోజు నుండి ఆరు నెలల లోపు తాడూర్ నందు గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మోటార్ వెహిల్ సెక్షన్ నందు సంప్రదించాలని ఇతరత్రా సమాచారం కోసం 87126 56428 ,90009 10619 ఫోన్ నంబర్లలను సంప్రంచాలని తెలిపారు.

నోట్ :

వాహన యజమానులు 6 నెలలలోపు తీసుకపోనీ వాహనాలకు వేలం వేయడం జరుగుతుందని,ఈ యొక్క వేలo 6 నెలల తరువాత నిర్వహించడం జరిగుతుందని,వేలం తేదీ ఎప్పుడు అనేది మేము మీకు తెలియజేస్తాము.

Advertisement
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Latest Rajanna Sircilla News