వాడవాడన మే డే:గంటా

సూర్యాపేట జిల్లా:అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం మే డే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన,వాడవాడలా జరపాలని ఐఎఫ్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన మేడే పోస్టర్ ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తే కార్మికుల హక్కులు,ఉపాధి దెబ్బతింటుందని,దీనితో కార్మికుల బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు లేబర్ కోడ్ లను యాజమాన్యులకు అనుకూలంగా సవరణ చేయడం కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు.

దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని,అధిక ధరలు పెరుగుతున్నాయని,వేతనాలు తరిగిపోతున్నాయని, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని అన్నారు.అసంఘటిత రంగ కార్మికుల జీవితాలకు ఎలాంటి భద్రతా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే,బిఎస్ఎన్ఎల్,విమానాయనం,నౌకాశ్రయం తదితర ప్రజల ఆస్తులను మోడీ కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని అన్నారు.136వ మే డే ను కార్మిక వ్యతిరేక విధానాలపై మే డే పోరాట దినంగా వాడ వాడలా జరపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతి శీల ఆటో డ్రైవర్స్,వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుంటి మురళి,జిల్లా శ్రామిక హమాలీ,మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఒగ్గు వెంకన్న,వేదాసు మల్లేష్,మడిపడిగా పురుషోత్తం,తండు వెంకన్న,ఒగ్గు చంద్ర శేఖర్, దారవత్ హుస్సేన్,దొనకొండ సైదులు,పాలబిందెలా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Advertisement

Latest Suryapet News