కేసీఆర్ తో వారి భేటీ ? కాంగ్రెస్ లో పొగలు సెగలు

అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడూ అసంతృప్తులు, గొడవలు, ఫిర్యాదులు వర్గ పోరు ఇలా ఎన్నో రకాల  ఇబ్బందులు నిత్యం వచ్చి పడుతూనే ఉంటాయి.

పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా, తమకు అనవసరం అన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో పొగలు, సెగలు పుట్టిస్తోంది.తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ కావడం పై పెద్ద దుమారమే రేగుతోంది.

అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎవరిని అడిగి కేసీఆర్ తో భేటీ అయ్యారు అంటూ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.నిన్న గాంధీ భవన్ లో ఇదే విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను వివరణ కోరగా, వారి మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం.

కాంగ్రెస్ ఎప్పుడు టిఆర్ఎస్ పై రాజీ లేకుండా పోరాడుతుందనే సంకేతాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు కేసీఆర్ ను కలవడం వల్ల పరోక్షంగా హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందనే వాదన బలపడిందని ఉత్తమ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.కేసీఆర్ తో భేటీ వ్యవహారంపై టిఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంది.

Advertisement

ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు.వాస్తవంగా హుజురాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు .అయినా గెలుపుకు ఢోకా లేదు అన్నట్లుగానే ఆ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ధీమాతో ఉన్నారు.

కానీ ఒక్కసారిగా కేసీఆర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారణంగా మొత్తం ఆ ధీమా పోయిందనేదీ ఉత్తమ్ అభిప్రాయం.వాస్తవంగా శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి వారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సాన్నిహిత్యం ఉంది.అయినా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బాగా దగ్గరి బంధువు .అందుకే హుజురాబాద్ ఎన్నికను మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలవడం వల్ల టిఆర్ఎస్ కు కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తోంది అనే సంకేతాలు జనాల్లోకి వెళ్లిపోవడంతో, ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది అనే భయం ఉత్తమ్ లో ఎక్కువయ్యిందట.

మొత్తానికి కేసీఆర్  కాంగ్రెస్ లో పెద్ద చిచ్చే రేపినట్టు కనిపిస్తున్నారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు