బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలి: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హుజూర్ నగర్ కాంగ్రెస్అభ్యర్ధి,నల్లగొండ ఎంపి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఆదివారం హుజూర్ నగర్, మేళ్లచెరువు,మల్లారెడ్డి గూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు,ఎమ్మెల్యేల అవినీతి,అరాచకాల వల్లనే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.

పదేండ్ల నుండి కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ నూటికి ఒక్క పని కూడా అమలు చేయలేదన్నారు.ఎమ్మెల్యే సైదిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తూ నాలుగేండ్లో 400 ఎకరాలు దోచుకున్నడని ఆరోపించారు.

Uttam Kumar Reddy Shocking Comments On Brs, Uttam Kumar Reddy , Brs , Cm Kcr, Co

నియోజకవర్గంలో కొత్త లిఫ్ట్ లు దేవుడెరుగు పాత లిఫ్టులు పని చేయడం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఆర్&ఆర్ సెంటర్ లు జూబ్లీ హిల్స్,బంజారా హిల్స్ లా ఉన్నయని,60 యేండ్ల క్రింద నిర్మాణం చేపట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద కుడి, ఎడమ కాల్వల నుండి 24 లక్షల ఆయకట్టు సాగులో ఉందని,కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్ష కోట్ల దోపిడి చేసి ఒక్క ఎకరం నీళ్ళు పారకుండానే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా 6 హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Latest Suryapet News