రాముడి కాలు తాకి మహిళగా మారిన 'అహల్య' గురించి చాలామందికి తెలియని విషయాలివే.!

పౌరాణిక పాత్రల్లో అందచందాల ప్రసక్తి రాగానే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు గుర్తొస్తారు.కానీ వాళ్ళు ఒకరకంగా ఇప్పటి క్లబ్బుల్లో కనిపించే డాన్సర్లతో సమానం.

 Unknown Facts About Ahalya , Gautama Maharshi, Brahma, Ahalya , Rama-TeluguStop.com

కనుక వాళ్ళ అందాన్ని ప్రశంసించలేం.ఇంకా అనేక కథల్లో సౌందర్యానికి ప్రతీకలు అనిపించే స్త్రీ పాత్రలు ఉన్నాయి.

ఆ అందానికి మంచితనం కూడా తోడైతే మట్టి బొమ్మ ప్రాణం పోసుకున్నట్లు అపురూపంగా ఉంటుంది.అలాంటి అద్వితీయమైన పాత్ర అహల్య గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

అహల్య అందాల రాశి, సుగుణాల పోగు.గౌతమ మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు బ్ర‌హ్మ ఏర్పాటు చేసిన స్త్రీ అహల్య.

అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు.కానీ, ఆమె ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా, నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయడంతో అహల్యే, గౌతమ మునికి తగిన భార్య అనుకున్నాడు బ్రహ్మదేవుడు.

ఒక‌సారి గౌతమ మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉండగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, “గౌతమా! నేను నీకేన్నో పరీక్షలు పెట్టాను.అన్నింటిలో  గెలిచావు.

ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే అది భూ ప్రదక్షిణతో సమానం.అనేక పుణ్యకార్యాలతో బాటు ఈ పని కూడా చేశావు.

ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నావు.అందుగ్గానూ నీకు గొప్ప అనుకూలవతి అయిన అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను.

అహల్యను స్వీకరించి, ధన్యుడివి అవ్వు ” అంటూ బ్ర‌హ్మ గౌత‌మున్ని ఆశీర్వదిస్తాడు.అంతేకాదు, స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి, అహల్యా, గౌతముల వివాహం జ‌రిపిస్తాడు.

1.అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుడ‌తాడు.తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనుతాడు.ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉంటుందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంటుంది.దీంతో దేవేంద్రుడికి భయం క‌ల‌గుతుంది.

2.గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భ‌య‌ప‌డ‌తాడు.దేవతల సహాయం అడుగుతాడు.

అందరూ స‌రేనంటారు.దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంతో వెళ్లేందుకు ఇంద్రుడు సిద్ధ‌మ‌వుతాడు.

Telugu Ahalya, Brahma, Rama-Telugu Bhakthi

3.ఇంద్రుడు చెప్పడం అయితే గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేయడం అని చెప్పాడు కానీ, అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం.ఈ క్రమంలోనే దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి  చేరుతాడు.

4.ఇంకా తెల్లవారకముందే, ఆ కోడి కూస్తుంది.దీంతో గౌతమముని ఉలిక్కిపడి లేస్తాడు.

బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేస్తాడు.పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరగా కారు చీకటిగా ఉంటుంది.

ఎక్కడా వెలుతురు ఉండ‌దు.కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్థం చేసుకుంటాడు గౌతముడు.

నాలుగడుగులు వేశాక‌ తిరిగి వెనక్కి వ‌స్తాడు.తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపిస్తాడు.

5.“ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా… తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా? అని ఆలోచిస్తూ గౌతముడు కోపంతో దహించుకుపోతాడు.దాంతో దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీస్తాడు.అప్పుడు గౌత‌ముడు ఇంద్రుడికి శాపం పెడ‌తాడు.దీంతో ఇంద్రుడి శ‌రీరం అంతా 1000 యోనిలు వ‌స్తాయి.వాటిని చూసి ఇంద్రుడు మ‌రింత కుంగిపోతాడు.

విష‌యం తెలుసుకున్న బ్రహ్మ శాప విమోచ‌నానికి మార్గం చెప్ప‌మంటాడు.

Telugu Ahalya, Brahma, Rama-Telugu Bhakthi

6.అప్పుడు గౌత‌ముడు ఆ 1000 యోనిలు కాస్తా 1000 క‌ళ్లు అవుతాయ‌ని అంటాడు.అప్పుడు ఇంద్రుడి దేహం మొత్తం ఉన్న 1000 యోనిలు 1000 క‌ళ్లుగా మారుతాయి.అప్ప‌టి నుంచి ఇంద్రునికి ఒళ్లంతా కళ్లు ఉంటాయి.

7.ఇక ఈ విష‌యంలో అహల్య తప్పు ఏమీ లేకున్నా, ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగదు.దీంతో క్షణికావేశంలో ఆమెను కూడా నిందిస్తాడు.

“నువ్వు రాయిగా మారిపో” అంటూ శపిస్తాడు.కానీ, వెంటనే దివ్యదృష్టితో అసలేం జరిగిందో చూసి పశ్చాత్తాప ప‌డ‌తాడు.

8.రాముడి పాదం తాకినప్పుడు నువ్వు మళ్లీ మ‌నిషివి అవుతావు అంటూ గౌత‌ముడు అహల్య‌కు కూడా శాప విమోచ‌న మార్గం చెబుతాడు.

అనంత‌రం కొంత కాలానికి ల‌క్ష్మ‌ణుడు, విశ్వామిత్రుడితో క‌లిసి రాముడు అడ‌వికి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని కాలు తాకి రాయిగా ఉన్న అహల్య మ‌నిషిగా మారుతుంది.అలా ఆమెకు శాప విమోచ‌నం అవుతుంది.

ఇదీ… అహ‌ల్య క‌థ‌.!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube