32 ఏళ్లుగా కార్యరూపం దాల్చని వెంకటేష్ సినిమా ఎంటో తెలుసా?

హీరో వెంకటేష్ హీరోయిన్ దివ్యభారతి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా బొబ్బిలి రాజా. ఈ చిత్రం 1990లో విడుదల కాగా, దీనికి డి గోపాల్ దర్శకత్వం వహించారు.

 Story Behind Venkatesh Bobbili Raja Sequel Details, Bobbili Raja, Bobbili Raja S-TeluguStop.com

ఇప్పటికీ కూడా ఈ చిత్రం టీవీలో వచ్చిందంటే ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉంటారు.అంతగా వెంకటేష్, దివ్య భారతి ల కాంబినేషన్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.ఏకంగా మూడు సెంటర్లలో 175 రోజులపాటు ఆడి వెంకటేష్ కి తన కెరియర్లో మొదటిసారిగా ఆ సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది.

బొబ్బిలి రాజా సినిమా విడుదలై 32 సంవత్సరాలు గడిచినా కూడా ఈ చిత్రం పైన దగ్గుబాటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అభిమాన ఉంటుంది.ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని అప్పట్లో వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

కానీ ఏ కారణాల చేతనో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం పక్కకు వెళ్ళిపోయింది.ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ చిత్రం గురించిన ఆలోచనలు దగ్గుబాటి కుటుంబానికి ఉన్నట్లుగా తెలుస్తోంది.

తనకు బదులుగా ఆ తన అన్న కుమారుడైన రానా చేత ఈ సినిమాకి సీక్వెల్ చేయించారని ఆలోచనలో కూడా వెంకటేష్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Bobbili Raja, Bobbiliraja, Venkatesh, Divya Bharathi, Rana Daggubati, Sur

అది అది కూడా కాదు ఇటీవల కాలంలో సురేష్ బాబు తన కుమారుడితో ఈ సినిమా చేయాలని కొన్ని కథలు కూడా విన్నారట.అయితే అది కూడా ముందుకు వెళ్ళే విధంగా కథలు రాకపోవడంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది.ఇంకా కొన్నాళ్లు ఆగితే రానకి వయసు పెరిగిపోయి ఆ పాత్రకు సూట్ అయ్యే అవకాశం కూడా ఉండదు అని ఆయన అభిమానులు, సన్నిహితులు భావిస్తున్నారు.

మరి బొబ్బిలి రాజా సీక్వెల్ రానున్న కొన్ని రోజుల్లో వస్తుందో లేదో తెలియాలంటే ఇంకా కొంతకాలం పాటు వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube