32 ఏళ్లుగా కార్యరూపం దాల్చని వెంకటేష్ సినిమా ఎంటో తెలుసా?

హీరో వెంకటేష్ హీరోయిన్ దివ్యభారతి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా బొబ్బిలి రాజా.ఈ చిత్రం 1990లో విడుదల కాగా, దీనికి డి గోపాల్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికీ కూడా ఈ చిత్రం టీవీలో వచ్చిందంటే ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉంటారు.

అంతగా వెంకటేష్, దివ్య భారతి ల కాంబినేషన్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.ఏకంగా మూడు సెంటర్లలో 175 రోజులపాటు ఆడి వెంకటేష్ కి తన కెరియర్లో మొదటిసారిగా ఆ సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది.

బొబ్బిలి రాజా సినిమా విడుదలై 32 సంవత్సరాలు గడిచినా కూడా ఈ చిత్రం పైన దగ్గుబాటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అభిమాన ఉంటుంది.

ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని అప్పట్లో వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.కానీ ఏ కారణాల చేతనో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం పక్కకు వెళ్ళిపోయింది.

ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ చిత్రం గురించిన ఆలోచనలు దగ్గుబాటి కుటుంబానికి ఉన్నట్లుగా తెలుస్తోంది.

తనకు బదులుగా ఆ తన అన్న కుమారుడైన రానా చేత ఈ సినిమాకి సీక్వెల్ చేయించారని ఆలోచనలో కూడా వెంకటేష్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

"""/"/ అది అది కూడా కాదు ఇటీవల కాలంలో సురేష్ బాబు తన కుమారుడితో ఈ సినిమా చేయాలని కొన్ని కథలు కూడా విన్నారట.

అయితే అది కూడా ముందుకు వెళ్ళే విధంగా కథలు రాకపోవడంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది.

ఇంకా కొన్నాళ్లు ఆగితే రానకి వయసు పెరిగిపోయి ఆ పాత్రకు సూట్ అయ్యే అవకాశం కూడా ఉండదు అని ఆయన అభిమానులు, సన్నిహితులు భావిస్తున్నారు.

మరి బొబ్బిలి రాజా సీక్వెల్ రానున్న కొన్ని రోజుల్లో వస్తుందో లేదో తెలియాలంటే ఇంకా కొంతకాలం పాటు వేచి ఉండాల్సిందే.

ఈ ప్రముఖ టాలీవుడ్ నటి ఇద్దరు కూతుళ్లు డాక్టర్లే.. ఎంతో అదృష్టవంతురాలు అంటూ?