మామూలుగా సినిమా బాగుంది అంటే చాలు చిన్న హీరోనా పెద్ద హీరోనా అని పట్టించుకోకుండా ఆ సినిమాలను బాగా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు.ఇక అభిమానులు ప్రేక్షకుల కోసం కూడా హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఉంటారు.
కానీ ప్రతిసారి అలా అనుకున్నది అనుకున్నట్టుగానే జరగదు.కొందరు హీరోలు ఏడాదికి ఒక్క సినిమాలో నటించకుండా ఉంటారు.
అలా ఈ ఏడాది 2023లో ఒక్క సినిమాతో కూడా సందడి చేయని తారలు చాలా మందే ఉన్నారు.వీళ్లంతా 2024లోనే కలుసుకుందాం అని చెప్పకనే చెబుతున్నారు.
ఇంతకీ ఆ సెలబ్రిటీలో ఎవరు అన్న విషయానికి వస్తే .చాలా మంది హీరోలు 2023లో వెండితెరపై సందడి చేయలేకపోయారు.
అగ్ర హీరోలు అయినా వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల డైరీల్లో విడుదల మాటే కనిపించలేదు.కొందరి చిత్రాలు ఊరిస్తూ ఊరిస్తూ వచ్చే ఏడాదికి మారిపోయాయి.తెలుగు చిత్రసీమకి మూల స్తంభాల్లాంటి కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున. ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమని కళకళలాడించారు.అదే జోరు ఇప్పటికీ చూపెడుతూ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.కుర్రకారుకి దీటుగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు.
ఈ ఏడాదిలో చిరంజీవి, బాలకృష్ణ ఒకొక్కరూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.రకరకాల కారణాల వల్ల వెంకటేశ్,( Venkatesh ) నాగార్జున( Nagarjuna ) ఖాతాల్లో ఈ ఏడాది సినిమా పడలేదు.
వెంకీ మాత్రం హిందీ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో చిత్రంలో కీలక పాత్రలో మెరిశారు.తొలిసారి రానా నాయుడు వెబ్ సిరీస్‌తో అలరించారు.
వెంకటేశ్ ‘సైంధవ్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా, విడుదల తేదీ మారింది.మరోవైపు గత చిత్రాల ఫలితాల్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జున కథల విషయంలో ఆచితూచి అడుగులు వేశారు.నా సామిరంగ కోసం ఇటీవలే రంగంలోకి దిగి చిత్రీకరణని పరుగులు పెట్టిస్తున్నారు.ఈ ఇద్దరు సీనియర్ల సందడి రానున్న సంక్రాంతికే.లెక్క ప్రకారం మహేశ్ బాబు,( Mahesh Babu ) రామ్ చరణ్ ల( Ram Charan ) చిత్రాలు ఈ ఏడాదిలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాలి.విడుదల తేదీలు కూడా ఖరారయ్యాయి.
కానీ చిత్రీకరణల్లో జాప్యంతో పాటు ఇతరత్రా కారణాలతో వాళ్ల చిత్రాలూ వచ్చే ఏడాదికి మారిపోయాయి.శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు కమల్‌హాసన్‌తో భారతీయుడు 2 కూడా సమాంతరంగా తెరకెక్కిస్తున్నారు.దాంతో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ నిదానంగా సాగింది.
అందుకే ఈ ఏడాది రామ్ చరణ్ ఖాతాలో సినిమా పడలేదు.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేశ్‌బాబు గుంటూరు కారం కూడా ఈ సంవత్సరమే రావాల్సి ఉండగా, సంక్రాంతి కోసం ముస్తాబవుతోంది.పుష్ప ది రైజ్ తో అల్లు అర్జున్( Allu Arjun ) పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసినా, ఆయన మాత్రం పుష్ప 2 కోసమే రంగంలోకి దిగారు.
దాదాపు పది నెలలు విరామం తీసుకుని ఆయన పుష్ప2 కోసం రంగంలోకి దిగారు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.