కేంద్ర మంత్రులకు స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు

సూర్యాపేట జిల్లా: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా కకావికలం అయిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్ కుమార్ హైదారాబాద్ నుండి హెలికాప్టర్ లో ఖమ్మం పర్యటనకు బయలుదేరారు.

వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సింగరేణిపల్లి టోల్ ప్లాజా వద్ద హెలిప్యాడ్ ల్యాండ్ చేశారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రెండు జిల్లాల కలెక్టర్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ముంపు ప్రాంతాలు, ప్రాథమిక నష్టాలు, మరణించిన వారి వివరాలతో కూడిన నివేదికలను రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులకు అందజేశారు.

Union Ministers Welcomed By State Ministers, Union Ministers , State Ministers,

అనంతరం రోడ్డుమార్గంలో పరిసరాలను పరిశీలిస్తూ ఖమ్మం పర్యటనకు బయలుదేరారు.

Advertisement

Latest Suryapet News