సినిమాల్లో హీరో, హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉండటం ఎంత ముఖ్యమో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
వారి మధ్య కెమిస్ట్రీ చక్కగా పండితేనే ఆ రొమాంటిక్ సినిమా హిట్ అవుతుంది.
కానీ కొన్నిసార్లు డైరెక్టర్ల కోరిక మేరకు హీరోయిన్లు మామూలు నటులతో కూడా జత కడతారు.ఈ రోజు అలాంటి కొందరు హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం, వారు అనుకోని నటులతో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించారు.
( Lokesh Kanagaraj - Shruti Haasan ) కోలీవుడ్ దర్శక దిగ్గజం లోకేష్ కనగరాజ్ హీరోగా ఒక సినిమా చేస్తాడని ఎవరూ కూడా అనుకోలేదు.ఇక, ఆయన సరసన సూపర్ హాట్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుందని అస్సలు ఊహించలేదు.
కానీ ఈ అనూహ్య జంట అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి నటించింది.ఈ వీడియో విడుదలైన తర్వాత ఘన విజయం సాధించింది.
( Sunil - Aarti Agarwal ) సునీల్ తెలుగు సినిమాల్లో ప్రముఖ హాస్య నటుడు.సునీల్ కమెడియన్‌గా రాణిస్తున్న టైమ్‌లో ఆర్తి అగర్వాల్ తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్.
వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తారని ఎవరూ అనుకోలేదు కానీ "అందాల రాముడు" సినిమాలో( Andala Ramudu ) ఆర్తి అగర్వాల్ సునీల్‌తో జతకట్టి చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది."నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు చూస్తే వీరి మధ్య చాలా అంతరం ఉన్నట్లు అనిపిస్తుంది.
అలాంటి వీరిద్దరూ, "అందాల రాముడు" సినిమాలో హీరో, హీరోయిన్ గా నటించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది.ఏది ఏమైనా ఈ జంట నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది, సినిమా కూడా ఘన విజయం సాధించింది.
( Viva Harsha - Isha Rebba ) వైవా హర్ష, ఈషా రెబ్బ కలిసి "త్రీ రోజెస్"( Three Roses ) వెబ్‌సిరీస్‌లో రొమాన్స్ చేశారు.ఈ సిరీస్ మొదటి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది, రెండవ సీజన్ కూడా రాబోతోంది.
( Krishna bhagavanudu - Simran ) ఈ జంట నటన, కెమిస్ట్రీ బాగా పండింది.మరోవైపు హాస్యనటుడు రచయిత కృష్ణ భగవాన్ సిమ్రాన్‌తో కలిసి "జాన్ అప్పారావు 40 ప్లస్" సినిమాలో ( John Apparao 40 Plus )రొమాన్స్ చేశాడు.ఒకప్పుడు సిమ్రాన్ బాలకృష్ణ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది.
అలాంటి ఈ తార ఒక కమెడియన్ తో జతకట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
( Chiranjeevi – Kajal Aggarwal ) మగధీర సినిమాలో రామ్ చరణ్ తో కాజల్ జతకట్టింది అయితే కొడుకుతో నటించిన ఆమె తండ్రి తో కూడా నటిస్తున్నది ఎవరు అనుకోలేదు కానీ ఈ ముద్దుగుమ్మ ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవితో రొమాన్స్ చేసి వావ్ అనిపించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy