Shekhar Master : బోర్ కొట్టిస్తున్న శేఖర్ మాస్టర్ డాన్స్.. ఎప్పుడు వేసిన స్టెప్పులే వేస్తారా అంటూ ట్రోల్స్?

మామూలుగా ప్రేక్షకులు ఎప్పుడైనా కొత్తదనాన్ని ఆశిస్తూ ఉంటారు.ఇక రిపీటెడ్ సీన్స్, డాన్స్, మ్యూజిక్ వస్తే చాలు తెగ చిరాకు పడుతూ ఉంటారు.

 Trolls Saying That Shekhar Master Dance Is Bored Will He Do The Same Steps As W-TeluguStop.com

అందుకే దర్శక నిర్మాతలైన, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రిపీట్ సన్నివేశాలు రాకుండా చాలా కేరింగ్ తీసుకుంటూ ఉంటారు.కానీ ఈ మధ్య చాలా మంది దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, డాన్స్ కొరియోగ్రాఫర్లు చాలా వరకు కాపీ కట్ లాంటివి చూపిస్తున్నారు.

ఇప్పటికే మ్యూజిక్ తమన్ కాపీ కట్ అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు జనాలు.అయితే తాజాగా శేఖర్ మాస్టర్ పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ( Shekhar master )మంచి పేరు సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.చిన్న డాన్సర్ గా అడుగుపెట్టిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు స్టార్ హీరోలచే డాన్సులు చేయిస్తున్నాడు.అలా తన డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.

తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేశాడు.ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేశాడు.

అంతేకాకుండా చిన్న హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తాడు.ఇక ఈయన వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా డాన్స్ షో లకు జడ్జిగా బాధ్యతలు చేపట్టాడు.

కాగా ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లకే జడ్జిగా చేశాడు.ఈయన మొదట్లో ఢీ 2, ఢీ 5 లో డాన్స్ డైరెక్టర్ గా చేశాడు.

ఆ తర్వాత జడ్జిగా అడుగు పెట్టాడు.ఇక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా జడ్జి గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా బాగా సందడి చేస్తున్నాడు.డ్యాన్స్ లలోనే కాకుండా కామెడీ పరంగా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఇక ఈయనకు సోషల్ మీడియా( Social media )లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా ఆకట్టుకుంటాడు.తన కూతురు, కొడుకు కూడా డాన్స్ లతో బాగా ఫిదా చేస్తూ ఉంటారు.శేఖర్ మాస్టర్ కూడా తన కూతురితో కలిసి పలుసార్లు బుల్లితెరపై డాన్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య శేఖర్ మాస్టర్ గతంలో చేసిన స్టెప్పులే మరోసారి రిపీట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.ఇప్పటికే పలు సినిమాలలో స్టార్ హీరోలతో చేయించిన ఆయన డాన్స్ లు ఇంతకుముందు వచ్చినట్లు అనిపించాయి.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకున్నాడు శేఖర్ మాస్టర్.

అందులో హీరోయిన్ శ్రీలీల( Sreeleela )తో కలిసి డాన్స్ స్టెప్ లు వేస్తూ కనిపించాడు.

ఇక ఇద్దరూ తమ పర్ఫామెన్స్ తో బాగా అదరగొట్టారు.కానీ చూసిన జనాలు మాత్రం ఆ డాన్స్ పట్ల కాస్త నిరాశ చెందుతున్నారు.

కారణం ఏంటంటే ఇదివరకే ఆ స్టెప్పులు వచ్చాయని.మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటూ.

ఎన్నో షోస్ కు తిరుగుతుంటారు.కొత్త కొత్త స్టెప్పులు వేయొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది వేసిన స్టెప్పులే వేసి మాకు బాగా బోర్ కొట్టిస్తున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube