మదర్ థెరిస్సాకు ఘన నివాళి...!

సూర్యాపేట జిల్లా: ఉపాధ్యాయ వృత్తిని వీడి అభాగ్యుల పాలిట దైవంగా మారిన మానవతామూర్తి మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో సోమవారం గ్రంథాలయ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మదర్ థెరిస్సా యుగోస్లేవియాలో 1910 ఆగస్టు 26న జన్మించి,ఇండియా చేరుకొని,ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరో అభాగ్యులకు, అన్నార్తులకు ఆకలి తీర్చే అమ్మగా మారారని కొనియాడారు.

కోల్ కత మురికి వాడల్లో పేదల దుస్థితి చూసి చలించిపోయారని,1937లో టీచర్ వృత్తిని వీడి విరాళాలతో సేవా కార్యక్రమాలు చేపట్టారని, 1962లో పద్మశ్రీ,1969లో అంతర్జాతీయ జవహర్ లాల్ నెహ్రూ అవార్డు, 1980లో భారతరత్న అవార్డు అందుకుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

Latest Suryapet News