జిల్లాకు ట్రైనీ ఐపిస్ అధికారి రాజేష్ మీనా

సూర్యాపేట జిల్లా:సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణలో ఉన్న ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనా సూర్యాపేట జిల్లాలో 6 నెలల శిక్షణ నిమిత్తం విధులకు రిపోర్ట్ చేశారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసి విధుల్లో చేరడం జరిగినది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా భౌగోళిక స్థితిగతులు,క్రైమ్ రిపోర్టర్ గురించి వివరించారు.అనుభవాలను వివరించి శిక్షణ కాలంలో నేర్చుకోవాల్సిన అంశాలపై సూచనలు,సలహాలను అందించారు.

ఈ 6 నెలల శిక్షణ కాలంలో ట్రైనీ అదికారి మండల పోలీస్ స్టేషన్లు,పట్టణ పోలీస్ స్టేషన్లు,క్షేత్ర స్థాయిలో పోలీసు విధులు,పోలీస్ అడ్మనిస్ట్రేషన్,కేసుల దర్యాప్తు,కోర్టు విధులు, క్రైమ్ రికార్డ్స్,ఇంటలిజేన్స్ విధులు,ఎస్ హెచ్ ఓ,ఎస్ డి పి ఓ విధులు మొదలగు వాటిపై క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందుతారు.రాజేష్ మీనా ఐపిఎస్ రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన వారు.2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.జోద్ పూర్ ఐఐటి నుండి వచ్చారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News