విహార యాత్రలో విషాదం

సూర్యాపేట జిల్లా:సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మదికేరి వద్ద కోటే అబ్బి జలపాతంలో నీట మునిగి తెలంగాణకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు.

తెలంగాణకు చెందిన 16 మంది బంధు మిత్రులు విహార యాత్ర నిమిత్తం కర్ణాటక వెళ్లారు.కుశాలనగర్‌లోని ప్రైవేటు హోమ్‌స్టేలో బస చేసిన పర్యాటకులు,ఇవాళ కోటే అబ్బి జలపాతం చూసేందుకు వెళ్లారు.

Tragedy On A Cruise-విహార యాత్రలో విషాదం-Sur

సరదాగా నీటిలో దిగిన ముగ్గురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించడం అసాధ్యంగా మారింది.

మృతులు కలకోట శ్యామ(38),శ్రీహర్ష (18),షాహీంద్ర (16)గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

గంటల తరబడి గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.అప్పటి వరకు సంతోషంగా తమ మధ్య ఉన్న ఆత్మీయులుు విగత జీవులుగా మారడంతో బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వీరు సూర్యాపేటకు చెందిన వారుగా తెలుస్తోంది.ఈ విషయం తెలిసి సూర్యాపేట పట్టణానికి చెందిన కలకోట వెంకన్న బంధు మిత్రుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Latest Suryapet News