టాలీవుడ్ హీరోయిన్ల జంతువులు.. వైరల్ ఫోటోలు!

సాధారణంగా మనం మనతోపాటు పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఎంతో ఇష్టం చూస్తుంటాము.ఈ క్రమంలోనే కొందరు కొన్ని పక్షులను, మరికొందరు కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్లు సైతం పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటికి టైం కేటాయిస్తూ ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు.మరి మన టాలీవుడ్ హీరోయిన్లు పెంపుడు జంతువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

శృతి హాసన్ పెట్ క్లారా:

కమల్ హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ గత ఐదు సంవత్సరాల నుంచి క్లారాఅనే పిల్లిని పెంచుకుంటున్నారు.ఈమె క్లారాను పొరపాటున ఎవరైనా అది.ఇది అని సంబోధిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు.

అనుష్క పెట్ జెన్‌ :

మన టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి "జెన్‌" అనే పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు.జెన్‌ అంటే అనుష్కకు విపరీతమైన ప్రేమను చూపిస్తుంది.అనుష్కను తమ కుటుంబ సభ్యులు బెస్ట్‌ పెట్‌ మదర్‌ అని కూడా పిలుస్తుంటారు.

తమన్నా పెట్ పెబిల్స్‌:

Advertisement

తమన్నాకు తన పెబిల్స్‌ అంటే పంచ ప్రాణాలు.ఈమె తన కుటుంబం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది పెబిల్స్‌ కి అని చెప్పవచ్చు.తమన్నా కరోనా బారిన పడిన తర్వాత క్వారంటైన్ పూర్తిచేసుకొని బయటకు రాగానే తన పెబిల్స్‌నీ ఎత్తుకొని ముద్దాడింది.

తనతో గడపడం తనకెంతో సరదాగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

కీర్తి సురేష్ పెట్ నైక్‌ :

మహానటి కీర్తి సురేష్ కుక్క పిల్ల పేరు నైక్‌.దానికి ఏడాది వయసు.ఇంట్లో ఉంటే మాత్రం కీర్తి సురేష్ తనతోనే ఎక్కువ సమయం గడుపుతారు.

వరల్డ్ పిక్నిక్ డే సందర్భంగా తన నైక్‌తో కలిసి బీచ్ విహారానికి వెళ్లిన ఈమె ఇంతకన్నా బెస్ట్ పార్ట్నర్ దొరుకుతారా.అంటూ సోషల్ మీడియాలో తన నైక్‌తో దిగిన ఫోటోలు షేర్ చేశారు.

రష్మిక పెట్ ‘ఆరా’ :

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

రష్మిక గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఓ కుక్క పిల్లను తెచ్చుకున్నారు.దానికి ‘ఆరా’ అని పేరు పెట్టి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు.తను ‘ఆరా’కి ఆహారం నుంచి మందుల వరకు అన్నీ తనే చూసుకుంటానని చెప్పుకొచ్చారు.

ఛార్మి పెట్ అలస్కాన్‌:

Advertisement

నటి ఛార్మి దగ్గర గత కొంత కాలం నుంచి ఒక కుక్క ఉంది.దాని పేరు అలస్కాన్‌.చార్మి దానిని పెంపుడు జంతువుగా కాకుండా ఒక బిడ్డగా చూసుకుంటుంది.

చార్మి తనతోపాటు తన అలస్కాన్‌ కి కూడా వ్యాయామాలు చేస్తుంటారు.

తాజా వార్తలు