సూర్యాపేటలో ఓకే రాత్రి మూడు వరుస దొంగతనాలు

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మూడు వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు.బాలాజీ నగర్ కాకతీయ స్కూల్ పక్కన గల కిరాణా షాపు సెట్టర్ తెరిచి రూ.

60 వేలు,శ్రీరామ నగర్ ఓ ఇంటిలో బీరువా పగులగొట్టి ఒక తులం బంగారం,మరో ఇంటిలో రూ.6 వేల నగదు దోచుకెళ్లారు.ఒకే రోజు మూడు ఇండ్లలో దొంగతనం జరగడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ ఈ దొంగతనాలు జరగడం గమనార్హం.కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోవడంతో అసలు విషయం తెలిసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Three Consecutive Thefts In One Night In Suryapet, Three Consecutive Thefts , Su

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.బాలాజీ నగర్, శ్రీరామ్ నగర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,విలువైన బంగారు నగలు,నగదు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని పోలీసులు సూచించారు.

దొంగతనం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్

Latest Suryapet News