ఆర్యవైశ్యుల సజీవ దహనానికి కారణమైన వారిని అరెస్టు చేయాలి

సూర్యాపేట జిల్లా:కామారెడ్డి జిల్లా సిద్దిపేట, రామాయంపేట గ్రామంలోని ఆర్యవైశ్యులైన సంతోష్, పద్మ సజీవ దహనానికి కారకులైన ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆర్యవైశ్య సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షులు ఈగ లక్ష్మయ్య గుప్తా డిమాండ్ చేశారు.

ఆదివారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోష్,పద్మ కుటుంబాన్ని అనేక విధాలుగా హింసించి,తప్పుడు కేసులు బనాయించి,సజీవ దహనానికి కారకులైన ఏడుగురిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి,క్రిమినల్ కేసు నమోదు చేసి ఉరితీయాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించి,తప్పుడు కేసులు బనాయించిన సీఐ నాగార్జునగౌడ్ ను తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు ఓరుగంటి సత్యనారాయణ,తాటికొండ సీతయ్య,తల్లాడ కేదారి, భిక్షం,శ్రీహరి,శ్రీనివాస్,బండారు నాగన్న,బండారు వినయ్,ఈగ నాగన్న,వీరన్న,ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్,సామా వెంకన్న,ఆనందం,తల్లాడ నారాయణ,కొండగడుపుల ఎల్లయ్య,సైదులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడు దగ్ధం
Advertisement

Latest Suryapet News