మునగాలలో దొంగల హల్చల్

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రానికి చెందిన వాసా శ్రీనివాసరావు ఇంట్లో దొంగలు పడి,ఇంట్లోని కప్ బొర్డ్ తాళం పగులగొట్టి అందులోని 4 స్టీల్ బాక్సులలో ఉన్న 18 తులాల బంగారు వస్తువులు,5 కేజీల 265 గ్రాముల వెండి వస్తువులు మరియు రూ.41వేల నగదును అపహరించుకు పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోమవారం మునగాల సీఐ పి.ఆంజనేయులు,ఎస్ఐ పి.లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 25 గురువారం మునగాలకు చెందిన వాసా శ్రీనివాసరావు భార్య కళావతి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లోని తమ కూతురు ధనలక్ష్మి దగ్గరకు వెళ్ళినారు.

సోమవారం ఉదయం 10 గంటల సమయంలో తన సెల్ ఫోన్ కు లింక్ ఉన్న ఇంట్లోని సీసీ కెమెరాలను ఓపెన్ చేసి చూడగా సీసీ కెమెరాలు పని చేయకపోవటంతో అనుమానము వచ్చి, వెంటనే తన తమ్ముని కుమారుడు వాసా ధనేష్ కు ఫోన్ చేసి ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూచి రమ్మని చెప్పారు.ధనేష్ ఇంటికి వెళ్లేసరికి ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని పెద్దనాన్న శ్రీనివాసరావుకి తెలియజేశాడు.

Thieves' Hullchal In Munagala-మునగాలలో దొంగల హ�

హుటాహటీన శ్రీనివాసరావు భార్య కళావతి హైదరాబాద్ నుంచి వచ్చి చూడగా 27వ తేదీ ఆదివారం అర్దరాత్రి సమయంలో దొంగలు ఇంటి మెయిన్ డోర్ తాళము పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి మెయిన్ బెడ్ రూమ్ లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లినట్లు గుర్తించి,పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ ఆంజనేయులు నేతృత్వంలో ఎస్ఐ లోకేష్,సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

సూర్యాపేట నుండి క్లూస్ టీమ్ ని పిలిపించి నేరస్థలంలో క్లూస్ ను సేకరించారు.అయితే దొంగలు ఇంట్లో సొత్తును దొంగిలించుకొని వెళ్తూ సీసీ కెమెరాల ఫుటేజ్ మరియు డీవీఆర్ ను కూడా ఎత్తుకెళ్లడం గమనార్హం.

Advertisement

Latest Suryapet News