పాడి పశువులు ఉండే రైతులు కచ్చితంగా జొన్న పంటను సాగు చేస్తారు.జొన్న సొప్పను పశువులకు ఆహారంగా ఉపయోగిస్తారు.
కాబట్టి అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంటలలో జొన్న పంట కూడా ఒకటి.మేలు రకం అధిక దిగుబడి ఇచ్చే జొన్న రకాలను సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.
పంట సాగులో అత్యంత కీలక విత్తన ఎంపిక.జొన్న పంట( Sorghum Crop ) సాగు చేసే భూమి స్వభావాన్ని, మార్కెటింగ్ ని బట్టి విత్తనాన్ని ఎంచుకోవడం మంచిది.తెల్ల జొన్న( White sorghum ) సాగు చేయాలంటే.CSH-16 రకం సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.ఈ రకానికి చెందిన పంట కాలం 105 నుంచి 110 రోజులు.ఒక ఎకరాకు దాదాపుగా 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి పొందవచ్చు.
నంద్యాల తెల్ల రకం జొన్నలను సాగు చేస్తే ఒక ఎకరాకు 16 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.ఈ రకానికి చెందిన పంట కాలం 95 నుంచి 100 రోజులు.పాలెం-2 రకం జొన్నను సాగు పాడి పశువులు ఉండే రైతులు( Farmers ) సాగు చేయడం మంచిది.ఈ రకానికి చెందిన జొన్న మొక్క ఆకులు అధికంగా వెడల్పు పెరుగుతాయి.
ఇక ఒక ఎకరాకు 13 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.ఈ రకానికి చెందిన పంట కాలం 105 నుంచి 110 రోజులు.
ఈ రకాలలో ఏదో ఒక రకం ని ఎంపిక చేసుకొని, విత్తన శుద్ధి( Seed Treatment ) చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కలు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు విత్తుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా దృఢంగా పెరుగుతాయి.జొన్న పంటలో కలుపు నివారించాలంటే.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకుంటే, చాలావరకు కలుపు విత్తనాలు నాశనం అవుతాయి.ఇక జొన్న పంట విత్తిన రెండు రోజులలోపు మూడు మిల్లీ లీటర్ల అట్రాజిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.జొన్న పంట 25 నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు నాగలితో అంతర కృషి చేయాలి.
ఆ తర్వాత కూడా కలుపు మొక్కలు పొలంలో కనిపిస్తే, కలుపు మొక్కలు విత్తనం దశకు రాకముందే వారిని నివారించాలి.కలుపును నివారిస్తే జొన్న పంటను వివిధ రకాల తెగుళ్ల, చీడపీడల నుండి సంరక్షించినట్టే.