కాంగ్రెస్ విలో పెన్షనర్ల భాగస్వామ్యం ఉంది

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో పెన్షనర్ల భాగస్వామ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చిందని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ( Ravella Sitaramaiah )అన్నారు.

గురువారం సూర్యాపేట కోదాడ పబ్లిక్ క్లబ్ అడిటోరియంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎన్.

సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ పెన్షనర్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా నాకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ రానున్న 2024 సంవత్సరంలో పెన్షనర్ల న్యాయమైన సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు రాష్ట్ర నాయకత్వంతో కలిసి కృషి చేస్తానన్నారు.ప్రభుత్వం బకాయిలు ఉన్న మూడు డిఏలతో పాటు పీఆర్సీ అమలు చేసి హెల్త్ కార్డులు ఉన్న పెన్షనర్లకు నగదు రహిత చికిత్సకు ఉన్న అడ్డంకులను ప్రభుత్వం తొలగించాలన్నారు.

అనంతరం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు,కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, పూర్ణచంద్రారెడ్డి,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News