ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య...!

సూర్యాపేట జిల్లా:అక్రమ సంబంధం( Illegal affair ) నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బంధువులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

సూర్యాపేట జిల్లా ( Suryapet District )మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వీర గోపయ్య (దివ్యాంగుడు),వీరకుమారి భార్యాభర్తలు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

The Wife Who Killed Her Husband Along With Her Boyfriend, Illegal Affair, Husban

భార్య వీర కుమారికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలియడంతో గతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈనేపథ్యంలో శనివారం రాత్రి భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఇదే అదునుగా భావించిన భార్య వీర కుమారి తన ప్రియుడితో కలిసి భర్తను ముఖంపై దిండు పెట్టి ఊపిరాకుండా చేసి హతమార్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మద్యం సేవించి మత్తులో గుండె ఆగి మరణించినట్లునమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.అంత్యక్రియలకు హాజరైనబంధువులు(తోబుట్టువులు) మృతదేహాన్ని పరిశీలించి మెడపై కమిలిన గుర్తులు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

గ్రామానికి చేరుకున్న పోలీసులు( Police ) బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.అక్రమ సంబంధం వల్లనే వీర గోపయ్య ను భార్య చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

జుట్టును దట్టంగా పెంచే సూపర్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!
Advertisement

Latest Suryapet News