కోదాడ చరిత్రలోనే పద్మావతి గెలుపు ఓ మైలు రాయి...!

సూర్యాపేట జిల్లా:2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి( Uttam padmavathi ) బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలోఓటమి చెందిన విషయం తెలిసిందే.అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపి, బీఎస్పీ,సిపిఐ,స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 34 మంది బరిలో ఉన్నా, కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్యనే బిగ్ ఫైట్ నడిచింది.

.2023 నవంబర్ 30న జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఆదివారం 3న జరిగింది.ఓట్ల లెక్కింపులో మొదటి నుండి ఆధిక్యం ప్రదర్శించిన ఉత్తమ్ పద్మావతి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్( Mallaiah Yadav Bollam ) పై 57,861 మెజార్టీతో గెలుపొందారు.

కోదాడ చరిత్రలోనే భారీ మెజారిటీతో ఉత్తమ్ పద్మావతి గెలుపొందారని పలువురు ప్రశంసించారు.కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణాలు దళిత బంధు,బీసీ బంధు, గృహలక్ష్మి,గంజాయి, ఇసుక దందా,మట్టి అక్రమ రవాణా,అన్ని సంక్షేమ పథకాలలో అవినీతి జరిగిందని,అందుకే పూర్తి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారని స్థానికంగా వినిపిస్తున్న టాక్.

ఉత్తమ్ పద్మావతి మాట్లడుతూ తన విజయం కోసం శ్రమించిన కాంగ్రెస్ శ్రేణులకు,ఓటేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్
Advertisement

Latest Suryapet News