సారు మీరు వెళ్ళద్దు అంటూ కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా:సారు,మేడం మీరు వెళ్ళద్దు అంటూ ఏడ్చిన విద్యార్థులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ( Yellareddypet )ల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత తొమ్మిది సంవత్సరాల నుండి ఉపాధ్యాయులుగా పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు రజిత( Rajita ), ఉపాధ్యాయులు మంజుల, అంజలి, శ్రీనివాస్ బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు భావోద్రేకానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

సారు, మేడం మీరు వెళ్లొద్దు అంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకోవడంతో అక్కడున్న వారందరినీ కలచివేసింది.తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం .

The Students Who Shed Tears Saying That You Should Not Go , Students, Teacher ,

బడులలో విద్యార్థులను సరైన క్రమంలో ఓనమాలు దిద్దించి విద్యాబుద్ధులు, సంస్కారాలు నేర్పిన ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆప్యాయంగా పాఠాలు చెబుతూ ఆటలు ఆడిస్తూ గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు మీరు వెళ్లొద్దు సార్ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.దీంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను చూస్తూ బోరున విలపించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీపై జిల్లాలోని వివిధ పాఠశాలలకు వెళ్లడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతం అవ్వడం అందరిని కలిసివేసింది.

Advertisement

Latest Rajanna Sircilla News