ఆరు పాత్రల్లో ఇరగదీసిన నభా నటేష్.. స్టోరీ కూడా సూపర్ కానీ అదే మైనస్..??

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి AD 2898( Kalki 2898 AD )” సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన భారతీయుడు-2 బొక్క బోర్లా పడింది.

 Darling Movie Minus Point , Kalki 2898 Ad ,darling Movie ,priyadarshi , Tolly-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మరొక తెలుగు సినిమా వచ్చింది.అదే డార్లింగ్.

జులై 19న రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.అస్విన్ రామ్ డైరెక్ట్ చేసిన ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ.“డార్లింగ్”లో నభా నరేష్( Nabha Natesh ) ఏకంగా ఆరు వేరియేషన్స్, ఆరు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది.

Telugu Review, Kalki Ad, Nabha Natesh, Priyadarshi, Tollywood-Movie

అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా ఆమె ఆరు పాత్రలో అద్భుతమైన వేరియేషన్స్ చూపిస్తూ అదరగొట్టింది కానీ దర్శకుడు సినిమా సరిగా తీయలేకపోయాడు.హీరోయిన్ సెంట్రిక్ కథ అయినా హీరోకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చెడగొట్టాడు.ఇంటర్వెల్ పరవాలేదనిపించింది కానీ క్లైమాక్సుకు చేరుకోగానే సినిమా అంతా గందరగోళంగా మారింది.

దర్శకుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సరిగా చెప్పలేక చేతులెత్తేసినట్లు అయ్యింది.కట్ చేస్తే సదరు డైరెక్టర్ మంచి హిట్టు కొట్టే ఛాన్స్ పోగొట్టుకున్నాడు.

Telugu Review, Kalki Ad, Nabha Natesh, Priyadarshi, Tollywood-Movie

ఈ సినిమాలో యాక్టర్ ప్రియదర్శి( Priyadarshi ) మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు.ఈ కథను సీరియస్ ప్రజెంటేషన్‌తో గానీ ఫుల్ లెంగ్త్ కామెడీతో గానీ ప్రజెంట్ చేయలేదు.అందువల్ల స్టోరీ అనేది సరిగా చెప్పలేకపోయాడు.కామెడీ పర్లేదు కానీ ప్రజెంటేషన్ చాలా పూర్ గా ఉండటం వల్ల సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వచ్చేసాయి.ఈ మూవీలో ఓ హీరో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు.పెళ్లి గురించి కలలు కంటాడు.

పెళ్లి అయ్యే టైంలో మాత్రం అతడి వధువు ఎవరితోనో వెళ్లిపోతుంది.ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో హీరోయిన్ పరిచయం అవుతుంది.

ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు.కాకపోతే హీరోయిన్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది.

అంటే అపరిచితుడు సినిమాలో విక్రమ్ ముగ్గురు వ్యక్తులుగా ఎలా ప్రవర్తిస్తాడో అలా ఈమె ఆరుగురు వ్యక్తులు లాగా ప్రవర్తిస్తుంది.అందువల్ల ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.

తీసుకున్న స్టోరీలైన్‌ అయితే బాగుంది కానీ పాటలు, ఇంటర్వెల్ తర్వాత సినిమా అసలు బాగోలేదు.ఇది ఓటీటీలో ఆడొచ్చు కానీ థియేటర్లలో కల్కికి పోటీగా నిలబడే అవకాశం ఉండకపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube