నింగికెగిసిన సాయుధ పోరాట ధృవతార

కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి ఇకలేరు.ఆదివారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచిన విప్లవ వీరుడు.

అమరవీరుడుకి విప్లవ జోహార్లు అర్పించిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ.సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి (97) ఆదివారం సాయంత్రం 4గంటలకు తన స్వగ్రామం ఆత్మకూరు (ఎస్) మండలం,తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచారు.కామ్రేడ్ అలుగుబెల్లి సూర్యాపేటలో చదువుకుంటున్న రోజుల్లోనే నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఆ తదుపరి పాఠశాలను బహిష్కరించి,సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.సూర్యాపేట ప్రాంత దళానికి నాయకత్వం వహించాడు.ఆ సందర్భంగా తమ ఇంటిపై రజాకారులు దాడి చేశారు.

రజాకార్లు కుటుంబాన్ని అనేక ధపాలుగా చిత్రహింసలకు గురి చేశారు.తనకోసం తన గ్రామ కార్యకర్తలపై దాడి చేశారు.

Advertisement

రజాకారుల క్యాంపులపైన అలుగుబెల్లి దళం అనేకసార్లు ప్రతిఘటించింది.తెలంగాణ సాయుధ పోరాటం ఉదృతితో నైజాంను నిలువరించే స్థాయికి చేరుకునే సమయంలో,యూనియన్ సైన్యాలు నైజాం వ్యతిరేక పేరిట తెలంగాణలోకి ప్రవేశించినా,పేరుకి నైజాం లక్ష్యంగా కానీ,కమ్యూనిస్టులపై వారి దాడులను కొనసాగించారు.

ఈ దాడితో రావి నారాయణరెడ్డి లేవనెత్తిన పోరాట విరమణ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో కామ్రేడ్ అలుగుబెల్లి ఒకరు.ఆ తరువాత మూడు సంవత్సరాలు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది.ఈ పోరాటంలో మిలిటెంట్ గానే కాకుండా రాజకీయంగా ముఖ్యపాత్ర పోషించారు.1951లో కేంద్ర కమిటీ చేసిన పోరాట విరమణను తీవ్రంగా వ్యతిరేకించాడు.కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికలలో ఎప్పుడూ విప్లవ వాదాన్ని బలపరిచేవాడు.విప్లవ పార్టీ నిర్మాణంలో తన పాత్ర పోషించారు.1967లో దేశానికి మార్గాన్ని నిర్దేశించిన నక్సల్బరీ పంథా మార్గంలో పయనించాడు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ వైపున పార్టీని విప్లవపథంలో నడిపిన కొద్ది మంది నాయకులలో అలుగుబెల్లి ఒకరు.

కోటపాడు పోలీస్ పటేల్ వెంకటరెడ్డి మొదలుకొని భూస్వామ్య,పెత్తందార్ల దాడులను ప్రతిఘటించడంలో అలుగుబెల్లి క్రియాశీలక పాత్ర పోషించారు.ఆ కాలంలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు.అత్యవసర పరిస్థితి తొలగిన తదనంతరం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి,అలుగుబెల్లి యలమారెడ్డి,గోపాల్ రెడ్డి,కాకి లక్ష్మారెడ్డిలను కలిసి ప్రజా ఉద్యమాల ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రోత్సహించారు.

దానితో తిరిగి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ,ప్రజా సంఘాలలో నాయకత్వాన్ని వహించారు.కరీంనగర్ ప్రతిఘటన పోరాటంపై రాజ్యం తీవ్ర దమనకాండ కొనసాగించే క్రమంలో అక్కడ లీగల్ నాయకత్వం కొరతతో కామ్రేడ్ అలుగుబెల్లి,కాకి లక్ష్మారెడ్డి కరీంనగర్ ప్రాంతానికి వెళ్లారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
నిర్మాతగా మారడంతో డబ్బంతా పాయె.. డిప్రెషన్‌లో ప్రముఖ టాలీవుడ్ హీరో..?

కరీంనగర్ పార్లమెంటుకు పార్టీ తరఫున పోటీ చేశారు.అమరత్వం చెందినాటికి ముందు రెండు దశాబ్దాలుగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ నెంబరుగా కొనసాగారు.

Advertisement

ఈమధ్య ఆరోగ్యం బాగా క్షీణించి క్రమంగా కార్యక్రమాలలో పాల్గొనడానికి శరీరం సహకరించలేకపోయింది.అందువలన జిల్లా కమిటీ నుండి రిలీవ్ చేయడంతో పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఎప్పటికప్పుడు పార్టీ ఎలా కొనసాగుతుందని తెలుసుకునే తాపత్రయం చేసేవారు.ఉక్కు క్రమశిక్షణ కలిగిన పార్టీగా నడవాలని కోరుకునేవారు.

ఈ చీలికల మూలంగా అవకాశవాదం పెరిగిందని బాధపడేవారు.కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ కామ్రేడ్ అలుగుబెల్లి,సుమారు 80 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కొనసాగారు.

పార్టీలో అడుగుపెట్టిన వద్ద నుండి అమరత్వం చెందే వరకు కమ్యూనిస్టుగా, విప్లవకారుడుగా కొనసాగారు.కామ్రేడ్ అలుగుబెల్లి విప్లవ కమ్యూనిస్టు పార్టీలో నిండు జీవితాన్ని కొనసాగించారు.

వారి ఆశయం సాధించేవరకు పోరాటాలను తీవ్రతం చేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సూర్యం ఆయనకు జోహార్లు అర్పించారు.అలుగుబెల్లి మరణం విప్లవోద్యమానికి తీరని లోటని అన్నారు.

Latest Suryapet News