సైనికుల త్యాగాలు చిరస్మరణీయం

సూర్యాపేట జిల్లా: దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్,జిల్లా అధ్యక్షుడు,డాక్టర్ గుండా మధుసూదన్ రావు అన్నారు.

శుక్రవారం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కోదాడ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరుడైన గోపయ్య చారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వర్తించడం వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని తెలిపారు.నేటి యువత దేశ సైనికులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించారు.ఈ కార్యక్రమంలో ప్యాట్రన్ గుండపునేని నాగేశ్వరరావు,పిఆర్వో శేకు రమేష్, సత్యనారాయణ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్
Advertisement

Latest Suryapet News