యూనిఫామ్ లేదని కొట్టిన ప్రిన్సిపాల్

సూర్యాపేట జిల్లా:స్కూల్ కు యూనిఫామ్ వేసుకు రాలేదని ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగు చూసింది.

పట్టణానికి చెందిన గ్రేస్ వాల్యూ ఐడియల్ స్కూల్ లో అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన గరిడేపల్లి హనీఫా(11) 6వ,తరగతి చదువుతుంది.

బుధవారం కారణాలు అడగకుండా వైట్ యూనిఫామ్ వేసుకు రాలేదని కర్రకు ఉన్న పేడ్ ముక్కలు తన చేతికి గుచ్చుకుపోయెల కొట్టడంతో ఉదయం నుండి హనీఫా భయపడుతూ స్కూల్లో ఉండిపోయింది.ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పినా ఇంకా ఎవరు నుండి నాకు ఫోన్ వచ్చిన ఇంతకు మించిన పనిష్మెంట్ ఉంటుందని బెదిరింపుకు పాల్పడిందని హనీఫా తండ్రి గరిడేపల్లి మురళి ఆరోపించారు.

The Principal Who Hit Him For Not Having A Uniform , Uniform , Principal, Amin

ఈ విషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదే విషయమై మండల విద్యాధికారి సలీం షరీఫ్ ను వివరణ కోరగా పాప తండ్రి గరిడేపల్లి మురళి ఆరోపణల మేరకు స్కూల్ ప్రిన్సిపల్ పై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు.

Advertisement

Latest Suryapet News