ఎన్నికలు దగ్గరికి వచ్చిన కొద్ది ఎత్తులు పై ఎత్తులతో రాజకీయ వాతావరణం హీటెక్కి పోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హార్ట్ టాపిక్గా మారిన నకిలీ ఓట్ల రాజకీయంపై రెండు ప్రధాన పార్టీలు హస్తన కు చేరాయి.కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విడతల వారీగా సమావేశమై ఫిర్యాదులు చేస్తున్నాయి .
తెలుగుదేశం పార్టీ అయితే అధికార వైసిపి పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ సానుభూతిపరులు వోట్లు తొలగిస్తుందని , అంతేకాకుండా వాలంటీర్ల పేరుతో ప్రజల నుంచి ఆధార కార్డులను, ఓటర్ ఐడి కార్డులను తీసుకొని ఆన్లైన్ పద్ధతిలో ఓట్లను తొలగిస్తున్నారని ,ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అసలు ఓట్లను తొలగించి వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చి తమకు రాజకీయ ప్రయోజనం దక్కేలా చూసుకుంటున్నారని అంతేకాకుండా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్న విషయాలపై కూడా ఈసికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది.
దానికి పోటాపోటీగా వైసిపి ఎంపీలు కూడా విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) నాయకత్వంలో ఎన్నికల కమిషన్ ను కలిసినట్లు తెలుస్తోంది.చంద్రబాబు హాయంలో జరిగిన అవకతవకలను సరిచేస్తున్నామే తప్ప అసలు ఓట్లను తాము తొలగించడం లేదని 2014 నుంచి జరిగిన అవకతవకలను పై విచారణ జరిపించమని తాము కూడా కోరామని చెప్పుకొచ్చారు.ఒక అబద్ధాన్ని పదేపదే మాట్లాడితే నిజమై పోతుందన్న గోబెల్స్ పద్ధతిని చంద్రబాబు( N Chandrababu Naidu ) పాటిస్తూ ఉంటారని, ఇప్పుడు ఈ విషయాన్ని కూడా అలానే రచ్చ చేయాలని ఆయన చూస్తున్నారు అంటూ విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు.
అసలు ఓటర్ కార్డును ఆధార్ కార్డు తో అనుసంధానం చేస్తే ఈ నకిలీ ఓట్లను ఈజీగా అరికట్ట వచ్చుంటూ తాను ఈసీ కి ప్రపోసల్ పెట్టినట్టు కూడా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు .మరి రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి .ఇప్పటికే వోటర్ కార్డు వెరిఫికేషన్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ వారు కూడా అధికార పార్టీ కనుసన్నలలో పనిచేస్తున్నారు అంటూ ప్రతిపక్షం తెలుగుదేశం ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ఒక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి
.