సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల నమోదు, ప్రసవాలు, ఎనీమియా కేసు గుర్తింపు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Anuraag Jayanti I )మాట్లాడారు.ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో గత నెలలో ఎన్ని సీజేరియన్లు చేశారో అడిగి తెలుసుకున్నారు.100 శాతం సీజేరియన్లు చేసే ప్రైవేట్ దవాఖానలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గర్భిణీలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని, అక్కడ అందుతున్న సేవలు, వసతులపై అవగాహన కల్పించాలనినిరంతరం పరీక్షలు చేసి వైద్యం అందించాలని సూచించారు.

సర్కార్ దవాఖానల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు చేస్తున్న వైద్య పరీక్షల పై ఆరా తీశారు.జిల్లా ఎంత మంది విద్యార్థినులు ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారు? వారికి ఎలాంటి వైద్యం, మందులు అందిస్తున్నారో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.వారిని నిత్యం పర్యవేక్షించాలని, మరోసారి వైద్య పరీక్షలుచేసి, నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా గర్భిణుల స్కానింగ్, అబార్షన్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.గౌతమి, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డా.సంతోష్, జిల్లా ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, డా.మహేష్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు నయీం జహా, ఉమా, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News