అదృశ్యమైన బాలుడు బావిలో శవమై తేలాడు

సూర్యాపేట జిల్లా:జూన్ ఐదవ తేదీన అదృశ్యమైన బాలుడు మూడో రోజు మంగళవారం బావిలో శవమై తేలిన విషాద ఘటన చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

బాలుడి మృతదేహం తాడుతో కాళ్లు చేతులు కట్టేసి ఉండటంతో ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉంటారా? బ్రతికుండగానే కట్టేసి బావిలో పడేశారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Latest Suryapet News