పంటపొలాల్లో ప్రత్యక్షమైన మెుసలి పట్టుకెళ్ళిన ఫారెస్ట్ అధికారులు...!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేందానికి చెందిన కోడి నాగయ్య పంట పొలంలో గురువారం మెుసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

రైతు నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.

గురువారం ఉదయం వరి పంటకు నీరు పెడదామని వెళ్లగా పొలంలో భారీగా దారులు ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా మొసలి( Crocodile )కనిపించింది.వెంటనే తోటిరైతులకు( Farmers ) ఈ విషయం చెప్పడంతో అందరూ కలిసి మొసలిని బయటికి వెళ్లకుండా చూస్తూ ఫారెస్ట్ ఆదికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు( Forest officials ) మొసలిని బంధించి కృష్ణా నది( Krishna river )లో వదిలేందుకు తరలించారు.మండల కేంద్రం సమీపంలోని చెరువులో మొసలి కనిపించినట్లు గతంలో పలువురు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని,ప్రస్తుతం చెరువులో నీరు ఎండిపోయి,ఎండకు తాళలేక మొసలి పంట పొలాల్లోకి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు.

మూసికి పూడిక ముప్పు
Advertisement

Latest Nalgonda News