కాలువలో కొట్టుకొచ్చిన శవం

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ -మేళ్ళచెర్వు ముక్త్యాల మేజర్ కాలువలో ఓ వ్యక్తి శవం కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

మృతిని కాళ్ళు,చేతులు తాళ్ళతో కట్టి ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎవరైనా హత్యచేసి తాళ్ళతో కట్టి కాలువలో వేశారా? లేక బ్రతికి ఉండగానే కాళ్ళు,చేతులు కట్టి కాలువలో వేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

The Corpse Washed Up In The Canal-కాలువలో కొట్టుకొ
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పెంచినట్టా లేనట్టా...?

Latest Suryapet News