కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి

సూర్యాపేట జిల్లా:అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు విమర్శించారు.

శనివారం జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ధరలు పెరిగి సామాన్య,మధ్యతరగతి ప్రజల బతుకులు భారంగా మారడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్రం చేశారు.కొన్ని రాష్ట్రాలు సుంకం తగ్గించిన్నప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించకపోగా కరెంటు,ఆర్టీసీ చార్జీలు పెంచితే,కేంద్ర ప్రభుత్వం డీజిల్,పెట్రోల్,గ్యాస్,నిత్యవసర ధరలు అమాంతంగా పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా ఈ రెండు ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు.

The Central And State Governments Have Failed-కేంద్ర,రాష్ట

ప్రధాని నరేంద్ర మోడీ అచ్చెదిన్ (మంచిరోజులు)వచ్చాయని,ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారనిఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవేనా మంచి రోజులు,ఇదేనా బంగారు తెలంగాణ అని మండిపడ్డారు.

పెరిగిన ధరలను తగ్గించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామని, ధరలు తగ్గించకపోతే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య,ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు,పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు ఛామల అశోక్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గోపగాని రవి,చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News