అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

నల్గొండ జిల్లా: పెద్దఅడిచర్లపల్లి మండలం ( Peda Adisharla Palli )మునావత్ తండాలో బుధవారం రాత్రి దత్తు (13) అనే బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుడిపల్లి ఎస్ఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.

మునావత్ తండాలో ఒక బాలుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడని సమాచారం వచ్చింది.వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని బాలుడి మృతిపై ప్రాథమిక విచారణ జరిపి,అనుమానస్పద కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

The Boy Died Under Suspicious Circumstances , Boy Died , Suspicious , Peda Ad

పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని, హత్యా,ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులు మాత్రం పాత కక్షలు మనసులో పెట్టుకొని తమ పాలివారే తమ బిడ్డను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

బాలుడు మరణంతో గ్రామంలో టెన్సన్ వాతావరణం నెలకొంది.

Advertisement
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News