ఓయూ డాక్టరేట్ పొందిన సంచార జాతి బిడ్డ తాళ్ళ శ్రీను...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ సంచార జాతికి చెందిన తాళ్ళ శ్రీను( Thala Srinu ) ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగంలో డాక్టరేట్ సాధించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

ఆచార్య ఎం గోనానాయక్ పర్యవేక్షణలో "భిక్షుకుంట్ల వారి మౌఖిక సాహిత్యం- సంస్కృతి" అనే అంశంపై శ్రీను పరిశోధన పూర్తి చేసి సమర్పించగా పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పి.

హెచ్.డి పట్టాను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

Thala Srinu, A Nomadic Child Who Got Doctorate From OU , OU, Thala Srinu, Osmani

తాళ్ళ శ్రీను తెలుగు విభాగంలో జాతీయ స్థాయి ఫెలోషిప్ కు ఎంపికై పట్టుదలే ఆయుధంగా పిహెచ్ డీ పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఆయనను పలువురు విద్యార్థి నాయకులు,పరిశోధక విద్యార్థులు,సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ అభినందించారు.

Advertisement

Latest Suryapet News