Madhusudan Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( MLA Goodem Mahipal Reddy )సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ( Madhusudan Reddy )పోలీసులు అరెస్ట్ చేశారు.

 Tension At Patancheru Police Station Of Sangareddy District Mlas Brother Arrest-TeluguStop.com

పటాన్ చెరు మండలంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పలు ఆరోపణలు వస్తున్నాయి.నాలుగు ఎకరాల్లో నిర్వహించాల్సిన మైనింగ్ సుమారు 15 ఎకరాల వరకు అధికారులు జరుగుతున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో అధికారుల ఫిర్యాదు మేరకు క్రషర్ నిర్వహిస్తున్న మధుసూదన్ రెడ్డిని పోలీసులు ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయనను పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.

తరువాత మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డారు.

దీంతో పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube