Director Teja ,Abhiram : అతనిని హీరో అని పిలవద్దు.. సీరియస్ అయిన తేజ?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతోమంది హీరోలను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత తేజ గారికి ఉందని చెప్పాలి.

 Don T Call Him A Hero Teja Who Is Serious ,teja ,abhiram , Director Teja,tollyw-TeluguStop.com

ఇప్పటికే ఉదయ్ కిరణ్ వంటి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ తాజాగా మరొక యంగ్ హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు.దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే అహింస సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయనకు విలేకరి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

అభిరామ్ ను డెబ్యూ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారంటూ యాంకర్ ప్రశ్నించగా వెంటనే తేజ మాట్లాడుతూ తనని డబ్బింగ్ హీరో అంటూ ఎలివేట్ చేయొద్దని వెల్లడించారు.నా సినిమాలో అభిరామ్ హీరో కాదు సినిమాలో ఆయన కూడా ఒక పాత్ర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Abhiram, Ahimsa, Teja, Nitin, Tollywood, Uday Kiran-Movie

తాను ఉదయ్ కిరణ్ నితిన్ వంటి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాను అప్పుడు ఎవరు కూడా వారిని ఎలివేట్ చేయలేదు ఇప్పుడు అభిరామ్ ను ఎందుకు చేస్తున్నారు అంటూ ఈయన ప్రశ్నించారు.మామూలుగా అయితే ఏ డైరెక్టర్ కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి హీరోల గురించి ఎవరు ఇలా మాట్లాడరు కానీ డైరెక్టర్ తేజ మాత్రం ఇందుకు చాలా భిన్నం.ఈయనకు ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలదు.ఇక అహింస సినిమా గురించి మాట్లాడుతూ ఈ పాత్రకు అభిరామ్ అయితే కరెక్ట్ గా సరిపోతారని అతనిని ఎంపిక చేసుకున్నానని ఈ సినిమా పూర్తి మాస్ మసాలా కంటెంట్ ఉన్న సినిమా అంటూ తేజ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube