పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు టీచర్స్ నాంది పలకాలి: ఎమ్మార్వో

సూర్యాపేట జిల్లా: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నాంది పలకాలని అనంతగిరి ఎమ్మార్వో అన్నారు.

కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని త్రిపురవరం గ్రామంలోని హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను గురువారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఉపాధ్యాయులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి ఉన్నతమైన విద్యను బోధించాలన్నారు.

Teachers Should Herald The Bright Future Of Children Anantagiri Mro, Teachers ,

అంగన్వాడి కేంద్రాలలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.మధ్యాహ్న భోజనం విషయంలో వంట సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాద్యాయులు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News