విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్.. POCSO చట్టం క్రింద కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ కనపర్తి బ్రమ్మం పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు .

ఈ సందర్భంగా సి.

ఐ మాట్లాడుతూ.కొనరావుపేట మండలం పల్లె నిజామాబాద్ గ్రామంలోని ZPHS పాఠశాల లో పోలీస్ అక్క కానిస్టేబుల్ మహిళ చట్టాలపై, షీ టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా కొంత మంది విద్యార్థులు పోలీస్ అక్క వద్దకు వచ్చి కనపర్తి బ్రమ్మం అనే టీచర్ కొద్ది రోజులుగా క్లాస్ రూమ్ లో విద్యార్థునుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నడాని ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి పోలీస్ అక్క పిర్యాదు మేరకు టీచర్ కనపర్తి బ్రమ్మం పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్ కి తరలించడం జరిగిందని సి.ఐ తెలిపారు.

సింహాచలం గిరిప్రదక్షిణ రద్దు.. భక్తులు అసంతృప్తి

Latest Rajanna Sircilla News