వాలంటీర్ల కు విరుగుడు మంత్రం “కుటుంభ సారధులు”

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ( AP Volunteers )సంక్షేమ పధకాల అమలు లో సమర్దవంతంగా పనిచేస్తునప్పటికి వారిని ఉపయోగించుకుంటున్న విదానం పై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి.ప్రభుత్వ ధనాన్ని జీతం గా ఇస్తూ పార్టీ కోసం పని చేయించుకుంటున్నారని, ప్రజల రహస్య డేటాను సేకరిస్తూ అనేక అక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుందంటూ జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తూ వస్తుంది.

 Tdp New Strategy Kutumbha Saaradhulu , Tdp , 2024 Elections, Nara Lokesh , Ku-TeluguStop.com

అంతే కాకుండా వైసిపి పార్టీకి అనుకూలంగా వోట్లు వేసేలా ప్రజలను బలవంతపెట్టే విధంగా వాలంటీర్లు పనిచేస్తున్నారని వైసీపీకి ఓటు వేయకపోతే అనే సంక్షేమ పథకాలు( Welfare schemes ) తొలగిపోతాయంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు వాలంటీర్లు పాల్పడుతున్నారని.అంతేకాకుండా ప్రజల నుంచి సేకరిస్తున్న రహస్య సమాచారానికి కూడా భద్రత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Telugu Ap, Ap Volunteers, Chandra Babu, Lokesh, Welfare Schemes, Ys Jagan-Telugu

అయితే వచ్చే ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థకు విరుగుడు మంత్రం తయారు చేయకపోతే ఎన్నికల ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇప్పుడు కుటుంభ సారధులు( Kutumba Saradhulu ) పేరుతో తన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొనున్నట్లు తెలుస్తుంది.దాదాపు ఆరు లక్షల మందిని రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నాటికి ఎంపిక చేసి వారిని ప్రజల వద్దకు అభిప్రాయ సేకరణకు పంపించాలని ప్రతిపక్ష పార్టీ భావిస్తుంది .ప్రజల ఆలోచనలు అభిప్రాయాలను కూలంకషంగా సేకరించి తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని వివరించడం ఈ కుటుంభ సారధుల బాధ్యతగా తెలుస్తుంది.నామమాత్రపు జీతాలు కూడా ఈ కుటుంబ సారధులకు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా ఏ వాలంటీర్ వ్యవస్థను అయితే తన ప్రైవేటు సైన్యంగా అధికార పార్టీ ఉపయోగించుకుంటుందో అలాంటి ప్రైవేటు సైన్యాన్ని తాము కూడా ఏర్పాటు చేసుకుని అధికార పార్టీ ఆటకట్టించాలన్నట్లుగా తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Ap Volunteers, Chandra Babu, Lokesh, Welfare Schemes, Ys Jagan-Telugu

దాంతో వచ్చే రోజుల్లో రాజకీయ సమీకరణాలు వాలంటీర్లు vs కుటుంబ సారధులు గా మారిపోయే అవకాశం కనిపిస్తుంది.మరి మూడో ప్రత్యామ్నాయంగా దూసుకొస్తున్న జనసేన ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube