ఏపీలో ప్రస్తుతం నెల్లూరు( Nellore ) జిల్లా రాజకీయాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఈ జిల్లాలో గత కొన్నాళ్లుగా వైసీపీ నేతల మద్య అసంబద్దత కొనసాగుతోంది.
కొందరు నేతలు వైసీపీకి దూరంగా ఉంటూ జగన్ పై అసంతృప్తి వెళ్లగక్కుతుంటే.మరికొండరేమో వ్యక్తిగత వివాదాలతో కాకరేపుతున్నారు.
ఫలితంగా జిల్లాలో పార్టీ ఫలం పై వైసీపీ అధిష్టానంలో ఆందోళన మొదలైంది.గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ</em క్లీన్ స్వీప్ చేసింది.
మరి అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ), వంటి వారు ఇప్పటికే పార్టీనుంచి బహిష్కరించబడి వైసీపీకి దూరంగా ఉన్నారు.
మరోవైపు నెల్లూర్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఆయన చిన్నాన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మద్య వివాదాలు తారస్థాయిలో జరుగుతున్నాయి.దీంతో ఈ పరినమలన్నీ జిల్లాలో పార్టీని తీవ్రంగా దెబ్బ తీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాపై టీడీపీ గురి పెట్టిందట.ఈ జిల్లాలో ప్రస్తుతం వైసీపీలో నెలకొన్న అసంబద్దతను అనుకూలంగా మలుచుకొని అధికార వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చి క్లీన్ స్వీప్ చేయాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారట.
ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు కూడా టీడీపీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నారు.
వీరిద్దరు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.స్థానికంగా బలమైన నేతలు కావడంతో వీరి ప్రభావం మిగిలిన నియోజిక వర్గాలపై కూడా ఉంటుంది.దాంతో ఏడు స్థానాలను కైవసం చేసుకునేందుకు చంద్రబాబు ప్రక్క ప్రణాళికతో నెల్లూరుపై ఫోకస్ పెట్టారట.
ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి వంటి వాళ్ళు చంద్రబాబు ( N Chandrababu Naidu )ఆదేశిస్తే జిల్లాలో ఏ నియోజిక వర్గం నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమని చెబుతున్నారు.అలాగే ఆయా నియోజిక వర్గాలలోని కీలక నేతలంతా కూడా ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈసారి నెల్లూరు జిల్లా టీడీపీ అడ్డాగా మరాబోతుందా అనే డౌట్ రాకమానదు.మరి ఏం జరుగుతుందో చూడాలి.