ఆగస్టు 26 శనివారం చంద్రబాబు( Chandrababu ) నివాసంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
“బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ”( Babu Surety-Guarantee for Future ) అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో 45 రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వారందరికీ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పట్టుదలతో అందరూ పనిచేయాలని సూచించారు.సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు నేతలకు తెలిపారు.
బూత్ వారి రోజుకు 10 కుటుంబాలకు వద్దకు గృహసారథులు వెళ్లాలని ఆదేశించారు.యూనిట్, క్లస్టర్ ఇన్చార్జిలు ప్రతి ఇంటికి వెళ్లి ఎలా ప్రచారం చేస్తున్నారో పర్యవేక్షించాలని సూచించారు.
మండల, పట్టణ, ప్రధాన నగరాల్లో పాదయాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కలవాలని పేదలకు దిశా నిర్దేశం చేశారు.ఇక “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం చివరి రోజు బహిరంగ సభ నిర్వహించాలని సూచించారు.ఈ సభలో తెలుగుదేశం పార్టీ ( TDP )అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో.ప్రజలకు తెలియజేసి నమ్మకాన్ని కలిగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా తాను 35 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.ఇదే సమయంలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.పుంగనూరు, అంగళ్లు ఘటనలో 91 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.300 మంది ఇల్లు విడిచిపెట్టి పరారయ్యారు.వాళ్లంతా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు.ఆ కార్యకర్తలను వాళ్ళ కుటుంబాలను శాశ్వతంగా నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెట్టారో.అదే రీతిలో ఇబ్బంది పెట్టే శక్తి, సామర్థ్యం తనకు ఉంది అని హెచ్చరించారు.
రౌడీయిజం.గుండాయిజం పూర్తిగా అణిచివేస్తానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.